ఎలా ఋణం తీర్చుకొంటాం విశ్వమానవుడైన చిత్రకారుడికి. అవ్యాజమైన ప్రేమగా గుర్తు చేసుకోవడం తప్ప.
మోహన్ నా కవితకి వేసిన బొమ్మ (1993).
దీపస్తంభం ప్రసరించే
కాంతిరేఖ నా చూపు
సాగరతీరాల సమస్త ప్రపంచానికీ
శాంతి నా రూపు
నాకు కవిత్వం
మౌనరాగాల పాట
ఉద్విగ్న మౌనప్రదర్శన
దాని పక్కనే ఉన్నది నాగసాకిలో విశ్వమానవుడి శిల్పం.