పడవ కోసం

పిల్లలాడుకొంటూన్న
సాయంత్రం వేళ
బుర్ర వంచుకొని
వలయాకారపు
త్రోవలో నడుస్తోన్న
సంధ్య వెలుగుని

తళుక్కున మెరుస్తోన్న
మస్కరా కళ్లవెలుగుల
మద్య శాల
ఆఖరు బెంచీ మీద
ధ్వనికి అతీతంగా
నిశ్శబ్ద ద్వీపంలో
ద్రాక్ష సారాని

నిద్రాస్వనానికి
ముగ్ధులైన
స్వప్న సంచారుల లోగిల్లో
మెలకువ కువకువలకి
తెప్పరిల్లిన
శూన్యరశ్మిని

దివారాత్రాల
పొడవు కొలుస్తూ
పడవ కోసం
ఎదురుచూస్తూ…