పాట మలుపులో నించొని
మూసిన కన్నుల చూసినప్పుడు
స్పష్టాస్పష్ట నాదానివా
బొట్లుబొట్లుగా ఒలుకుతోన్న
మధు భాండానివా
శబ్ద సౌందర్యానివా
ఎలా పోల్చుకోను?
బొమ్మవై
ఆకారరహితమై
మనో నిశ్శబ్దానివై
మార్మికమై మంత్రగత్తెవై
పక్షివై
ప్రియురాలివై
గాలితరగవై…
ఎలా పోల్చుకోను