శ్రద్ధ

పొట్టి చేతుల చొక్కా వేసుకొని వెళ్లాను
‘ఏమిటి కొత్తగా ఉన్నావు’ అన్నారు వాళ్ళు
చొక్కా చేతుల పొడవుతో కూడా
కొత్తదనం వస్తుందా ?
ఒకరోజు టై కట్టుకోకుండా వెళ్లాను
నాకు పని మీద శ్రద్ధ లేదని తీర్మానించారు