జూకా మందారం

ఎదిగిన పిల్లల్ని
పరిచయం చేస్తూ
ఆమె

రెండు జళ్ల
పట్టు పరికిణి
కౌమారమై
జూకా మందారాల
పువ్వులందుకోడానికి
ఎగిరి గెంతినప్పుడు
సాయమందించిన
ఉదయం వలె

ఎవరన్నారు
పువ్వులు వాడిపోతాయని
జ్ఞాపకాల పరిమళమై
నిత్యమూ వికసించవూ…