పద్యం – రెండు భాగాలు

పద్యం
రెండు భాగాలు

ఒక భాగం
తన పరీరంభంలో
ప్రపంచాన్ని చుట్టి
అలంకారాలని
విభక్తుల్ని
నిషేధించిన క్రియలని
పదచిత్రాల
పరిమళాలతో
గుబాళిస్తుంది

మిగతా సగం
నీ గురించే

తెరిచి మూసే
కళ్ళలా
శబ్దానంతర
నిశ్శబ్దంలా