తప్పొప్పులు

మొదటి తప్పు చేసి
పశ్చాత్తాప పడతాను

మరోసారి చేసి
ఇబ్బంది పడతాను

పరిపాటి గా మారినప్పుడు
దుఃఖమూ లేదు
పశ్చాత్తాపమూ లేదు
ఆనంద విహారి నవుతాను

తప్పొప్పుల పట్టిక
తారుమారవుతుంది
దిగుడు బావిలో
ఈత వెచ్చగా..

నిద్రకీ మత్తుకీ
ఆందోళనకి ఉద్వేగానికి
తేడా తెలియనట్టే.

నడిచిన త్రోవ
చెదిరి
గతానికి వర్తమానానికి
సంధికుదరక
కొత్త ముఖంతో

మారేది నడకైనా, నడతయినా
నేను వేరే
కొత్త పూతల చెట్టే