వంతెన క్రింద నీళ్లు

వై యెస్ ఆర్ పోయినప్పుడు చాలా బాధ పడ్డాను. కళ్ళమ్మట నీళ్లు కూడా వచ్చేయి.
బాలు పోయినప్పుడు నొచ్చుకున్నాను.
ఇద్దరంటే వల్లమాలిన ప్రేమ కాదు
అలవాటయిన వాళ్లు.
నేను కూడా సమాజంలో భాగమే కదా అందుకే నేమో.

కొన్ని రోజులు అట్లా.
శ్రీ వారిని మహా నేత అన్నా, బాలూ ని గాన గంధర్వుడన్నా, పెదవి సిద్ధపడుతుంది విరవడానికి. వాళ్ళు వాళ్లే అంతే
అయినా ఇవి నా మనస్సులో విషయాలు గానీ, నేను తాలీబాన్ కాదు అలాగే వాళ్ల ఇండియన్ వెర్షన్ కూడా కాదు.

వంతెన క్రింద నీళ్లు ప్రవహించాలి మనం చూసి ఆనందపడాలి.
01.10.20