అద్దం అబద్ధం

అద్దంకంటే
అబద్ధం ఎక్కడైనా
కనిపిస్తే చెప్పు
ఒకసారి పలకరిస్తా..

ప్రతిసారీ
కనిపిస్తాయి కొత్త ముఖాలు
ఒకరోజు నాన్న
ఒకరోజు తమ్ముడు
మరోరోజు కత్తిరిమీసాల
ఆఫీసు మొదలాలి
ఇంకోరోజు విదూషకుడి
వేషంలో మహాకవి

గెడ్డం నురుగులాగో
వడివడి అడుగుల
గడియారం నడకలాగో తప్ప
రెండు కళ్ళు, కళ్ళ మధ్య ముక్కు
పైన నుదురు కనబడనే
కనపడదు