వరద

వరద

ఇన్ని చిన్ని స్వప్నాలకీ
మెదడు గూడుమీద
అల్లుకునే ఇంద్రధనుస్సులకీ
కారణభూతమైన నీ చూపు

కాంతిమయమై
వెలుగు వత్తిళ్లలో ఒగ్గి
నా గుండెమీద వర్షించడం
ఆనందబష్పాలు కాదు
ఖచ్చితంగా వరదే…

(అక్టోబర్ 83 నడిచివచ్చిన దారి)