నిశ్చల చిత్రం

నిశ్చల చిత్రం

కదులుతోన్న భూమ్మీద నడుస్తోన్న నేను
ఎలా ఆగిపోగలను?
ఈ క్షణాన్ని అనుభవించమంటే
ఏ క్షణాన్ని పట్టుకోగలను?

పాత బాకీల నాన్నగార్నించి
పురిటి నొప్పుల అమ్మనించి
పెనిమిటినై అచ్చుతప్పుల
జన్మోదంతాన్ని పిల్లలకి
కథలుగా చెప్పి
పావురాల్ని ఎగరేస్తున్నాను
కొంచం ఆగి చూస్తారా?
ఆగగలిగితే, నిలకడగా నిలవగలిగితే

మళ్లీ దోవతప్పినపుడు
మరోసారి భ్రమావరణంలో
చిక్కుకున్నపుడు
రాళ్లతో కొట్టకుండా
ప్రశ్నల్నించి బయటపడేస్తారా?