సురభి నాటకాల టెక్నిక్కులు మనలోకి విస్తరించుకొన్న స్టేజి కథాకేళిని తలిపంచే వేషభూషణాలూ కబుకీ మనకేమీ దూరం కాదు.మనమే మనకి దూరమయ్యేం. నాటకమేది? సంప్రదాయ కళలేవి? తెరతప్ప హీరోలు తప్ప ఏం మిగిలింది మనకి?
సోమవారం పొద్దున్న 11 గంటలకి నాలుగు గంటల నాటకం చూడ్డానికి 800 మంది పట్టే హాలు నిండిందంటే ఏం చెప్తాం జపనీయుల గురించి. 60 మంది నిలబడి (స్టాండింగ్ టికెట్స్) గంటన్నర ఒక అంకం చూడ్డానికి ఎగబడ్డారంటే ఎలా అభినందించాలి? నాటకం మధ్యలో చప్పట్లతో స్ఫూర్తినివ్వడం విశేషమే