​ఉదయమూ సంధ్యా

రాత్రీ పవలూ
చిగుళ్లూ పువ్వులూ
చినుకులూ ఝరులూ
ప్రవాహమూ పరవళ్లూ
నిరంతరాయం

కాలం లెక్కెట్టుకొనే
నోట్లకట్ట కాదు
రద్దయి పోయే గతమూ కాదు
కాలం నిత్యభోగం

కాలం జరరుజాలెరుగని
నిత్య బాలెంత
సుఖదుఃఖాలకతీతమైన
శిశూస్వనం
ముత్తవ్వల కథల కల్ హారమాల
కాలం
వేల పాదాల
మనిషి పురోగమనం
అనంత మస్తిష్కాల
ఆవిష్కరణ
కల్పవికల్పాల
పరిణామ కీల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *