విచ్చుకొన్న మనస్సుతో
తెరుచుకొన్న అంతర్నేత్రాలతో
ఎన్నిసార్లు తలుచుకొన్నాను కానూ
చిన్నప్పుడు స్కూలు బయిట
ఐస్ ఫ్రూట్ కావాలని
అమ్మనే కదా అడిగింది
పెద్దయ్యేక ఈ అమ్మాయే
అని నాన్నగారితో కదా చెప్పింది
ప్రొమోషన్ కోసం జీతం పెంచమని
ఎవర్ని అడిగేను
పిల్లదాని చదువుకి డబ్బు
ఎవరిచ్చేరు
నా ముసలితనాన్ని తాకట్టు పెట్టి
కదా సమకూర్చుకొన్నాను
పుస్తకం పుటల్లోనో
మాటల బాటల్లోనో
నిరూప స్వరసమూహ మధ్యంలోనో
అంగార వలయాల వివసత్వంలోనో
దేశాలు ద్రావకాలై
అందరమూ ఒంటరి వాళ్లమయినప్పుడు….
చింతాంతరంగాల
చితికిపోయినప్పుడు
అప్పుడు కూడా….
అడగడానికేమీ లేదు.