దుఃఖాన్ని సీసాలతో దిగమింగినట్లు
ఆనందాన్ని క్రేట్లతో పంచుకున్నట్లు
ద్రవం ద్రావకమై సాంగత్యాన్ని శాసిస్తోంది
ఉదయం చీకటి చప్పుళ్లకోసం నిరీక్షణ
పగలంతా వెతుకులాట
రైళ్లు పరిగెడుతోన్న చప్పుడు
పడవ ములుగుతోన్న అలజడి
రేయంతా భ్రమవిభ్రమాల కొట్లాట
పొగపెట్టిన గరళం
పగపట్టిన వ్యసనం
ఘనమైన దీపంలా
చీకటి కమ్ముకొన్న జీవితం
ప్రతీసారీ దూడ గడ్డికోసం
తాటి చెట్టెక్కినట్టు
సుఖదుఃఖాలన్నిటికి
సురాస్వాదనా సంబంధం
అడుగులేసినప్పుడే
నేర్చుకొన్న తప్పటడుగు
స్వరసమ్మేళనలొ
శ్రుతి కలిపిన అపస్వరం
పలుగెత్తినప్పుదే ఉబికిన
చెమట చుక్క
గొంతు ఆర్చుకపొయిన కలత నిద్ర