కళ్లు చూసినదాన్ని విశ్లేషించే మనసు
నోరు పలికిన మాటలకి జవాబు వినే చెవులు
కరస్పర్శలో వులిక్కిపడే శరీరం
ప్రేమ ఇంకా భౌతికమేనా
ఇంద్రియాల ప్రతిక్రియ వట్టి దైహికమేనా
కల వట్టి వూహా జనితమేనా
అంతశ్చేతనలో అంతర్జల యాత్ర
భౌతిక చలనంలొ గగుర్పాటు
రాత్రినించి విడిపడ్డ పగలు
పగలే పరిణామక్రమంలొ రాత్రి
ఆమె బాహువుల్నించి వేరుపడ్డాక
మనసులోంచి జారిపోయిందా
ఆజన్మాంత సంచారం
బయటకి లోపలకీ