పని వేళ
పలకరించకు
పది మందిలో ఉన్నప్పుడు
పలకరించకు

ప్రభాత వేళ
సంధ్య వేళ
స్వప్న నిశ్శబ్దాల వేళ
నీకోసం
చెవులు రిక్కించి
చూస్తూ వుంటాను
పలకరించవేమి?

మగత నిద్రలో
నా పలవరింత
వినిపించలేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *