కాస్తంత వేడి తగ్గితే చాలు
చలేస్తుంది మాకు
మకుటం పక్కన పడేసి
డస్సినట్టు మబ్బు దాపల
బాల సూరీడు
రాడు రాడు పగటి రేడు ఇవాళ
వల పన్నింది వాన
వినబడిందా పిడుగు పాటు
పాట పాడే చిన్ని గొంతు
గంతులేసే మెరుపు తీగ
తగిన సమయం
మాయ లోకపు విహారానికి
నాకు నెచ్చెలి పుస్తకం