నన్ను నేను కొక్కేనికి
తగిలించుకుని
విడుదలై
కాలు చాపుకొని
నక్షత్రమండలం కేసి
చూస్తే
పంఖా గిర్రున తిరిగింది
మూతబడ్డ కప్పులోంచి
లోపలికి రాలేక
కిటికీలోంచి
తొంగిచూసే వెన్నెల
రాత్రి ఎప్పుడయ్యిందో
తెలీనప్పుడు
ఉదయం కోసం చూడ్డం వృధా
పుక్కిలించిన నోట్లోంచి
ఉలిక్కిపడ్డ వక్కముక్క
గీసిన నాలిక మీద
అక్షరాల వెలుగు
చెప్పుల్లో కాళ్ళు పెడితే
రోజు మొదలైనట్టే.
చిల్లులు పడ్డ చెవుల్లో
ఉలి దెబ్బల మాటలు
మొదలైనట్టే
5.9.20
సారంగ 15.12.20 సంచికలో ప్రచురణ