రాయడం అలవాటయితే
ఎలాగైనా రాయచ్చు
వాక్యాల దొంతరలో చమ్కీ దండలు
కను కొలుకుల్లో నీటి చెలమలు
గుక్క తిప్పుకోవడానికి
ఎడమిచ్చిన చుక్కలు
అర్ధానుస్వారాలు
పాతబడిన అందెల చప్పుళ్లు
అల్ల కల్లోలపు గుంపులో
స్పర్శల నిశ్శబ్ద సంభాషణ
ఏదైనా చెప్పొచ్చు
మాట్లాడ్డం అలవాటయితే
మంత్రదండం విదిలించచ్చు
కాలాన్ని దాటే మాటే కవిత్వం
వేదం కూడా
ఒకనాటి మాటల సెలయేరే కదా
28.7.20