తలుపులు మూసి
తలపుల కవాటాలు తెరిచి
కళ్ళు మూసి
కలల పరదాలు పరిచి
చుక్కల లెక్కలో చక్కర్లు కొట్టి
ఛప్పన్న చప్పుళ్ళు విని
వొళ్ళు మరిచి మరిచి
స్పష్టాస్పష్ట విశ్లేషణ విడిచి
శవాసనమై
శ్వాస లయబద్ధమై
తేలికై కన్నుతెరిస్తే
బళ్ళున తెల్లవారుతుందా!
తలుపులు మూసి
తలపుల కవాటాలు తెరిచి
కళ్ళు మూసి
కలల పరదాలు పరిచి
చుక్కల లెక్కలో చక్కర్లు కొట్టి
ఛప్పన్న చప్పుళ్ళు విని
వొళ్ళు మరిచి మరిచి
స్పష్టాస్పష్ట విశ్లేషణ విడిచి
శవాసనమై
శ్వాస లయబద్ధమై
తేలికై కన్నుతెరిస్తే
బళ్ళున తెల్లవారుతుందా!