నా కిటికీ బయట
చెట్టుమీద ఎగిరింది
ఓ కాకి

ఇది టెడ్ హ్యూస్ కాకి కాదు
గాల్వే దీ కాదు
ఫ్రాస్ట్, పాస్టర్నాక్, లోర్కా
వీరెవరి కాకీ కాదు
యుద్ధం తర్వాత భీభత్సంలోని
హోమర్ కాకుల్లోది కూడా కాదు

ఒక కాకి అంతే!

ఏదీ తన జీవితంలో ఇమడకుండానే
చెప్పుకోదగ్గ ఏ ఘనకార్యమూ
చెయ్యని కాకి
కాస్సేపు ఆ కొమ్మ మీద కూర్చొని
పుంజుకుని
అందంగా ఎగిరిపోయింది
నా జీవితంలోంచి

రేమండ్ కార్వర్ My Crow పద్యానికి అనువాదం. (రేమండ్ కార్వర్,అమెరికన్ కవి, కథకుడు 1938-1988)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *