దేశమంతా నడుస్తూనే ఉంది
చూస్తున్నాంగా.
కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తోంది గానీ
విడిగానే విడి విడిగానే
భయపడ్డ భద్రలోకపు లోగిళ్ళనుంచి
చాకిళ్ళనించి
అభద్రత నుంచి
తమతమ నెలవులకేసి
తరతమ భేదాల జ్ఞానంతో
కలిసి నడవడానికే
ఆయత్తమవుతూ

చీమల నడక చప్పుడు ఎప్పుడైనా విన్నావా
అల ఊపిరిపోసుకొనే
క్షణాన్ని గుర్తుపట్టేవా

ఇంకా సమయం ఉందనిపిస్తే
సంచీ భుజాన్న వేసుకో
ఉన్నపళాన లేచిరా
నడక నేర్చుకో
నలుగురితో కలవడానికి

ఇంక సమయం లేదనిపిస్తే
ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో
కాలాన్ని కొలుస్తూవుండు

(Afsar Mohammad పద్యం చదివిన ప్రేరణతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *