కళ్ళు లేవేంట్రా మూర్ఖులూ!
అన్నారు మేష్టారు
ఉ-ఉన్నాయి సార్
అని అ-అబద్ధం ఆడేం
ఉన్నవి కళ్ళు కాదు
గాజు గోళీలు
చె-చెవి వినిపించదా, చెవుడా?
అన్నారు మేష్టారు
లే-లేదు సార్ ఉన్నాయి అన్నాం
అయినా నాకు తెలుసు
సంక్రాంతప్పుడు దాచిపెట్టుకొన్న రెండు చెవి
పోగులు: ఒకటి నీలం
రెండోది కెంపు
నీ త-తల!
అన్నారు మేష్టారు
ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? అని
ఊరంతా వెతికేం.
(కన్నడ మూలం: AK Ramanujan “మత్తు ఇతర పద్యగళు” (ఇంకా మిగతా పద్యాలు) పుస్తకం నించి