చదువు పేరు చెప్పి ఇల్లు
ఉద్యోగమని ఊరు
వదిలిపోయేం

ఇంకొంచెం దూరమే కదా అని
దేశం దాటేసేం

ఏ కారణాలు చెప్పినా
అసలు రహస్యం
బతకడానికి

బతకడానికి
కావలసిన డబ్బుకోసం

ఇప్పుడు బతుకుతున్నాం
అవును, బతుకుతున్నాం

అనిపిస్తూ ఉంటుంది
‘ప్రయాస పడి
ప్రవాసం కోరుకున్నాం కదా’ అని

ఈ తలుపు బయటకి
తెరుచుకొనేది మాత్రమే
మళ్ళీ గర్భసంచిలోకి
చేరలేం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *