నువ్వంటావు
‘ఎప్పుడూ పాత చొక్కాయేనా?’
కొత్తగా ఉన్నప్పుడు కూడానా!
గుడ్డ కొని
కొలతలిచ్చి
దర్జీ కుట్టేదాకా ఆగి
సరిచూసుకొని
ఇస్త్రీ చేసుకొని
కట్టుకొన్నప్పుడు కొత్తది కాదా?
నాలాగే
కాలాన్ని, ఎండనీ,నీటినీ,
సబ్బుని, నురగని
భరించేక పాతబడదా
గట్టిగా ఉన్నంతకాలం
వంటిని కప్పినంత కాలం
నాతో ఉండనియ్యి
కాఫీ మరకలు
జబ్బలకింద రంగు మారడం
లేనంతవరకు
కాస్తంత రంగు తగ్గుతేనేం ఉండనియ్యి
పాత చొక్కా కూడా
చొక్కాయే