చూస్తూనే ఉన్నానా,
మొగ్గ
ఎప్పుడు విచ్చుకొందో
తెలీనే లేదు

నాతోనే నడుస్తున్న
చందమామ
ఆకాశం అంతా
ఎలా వెలుగు చిమ్ముతోందో!

వాక్యాల కోసం
వెతుక్కుంటూనే ఉన్నానా,
మెరుపులా, నవ్వే ధాన్యం గింజలా
పద్యమెలా విరిసిందో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *