ఎగురుతూనే ఉంటుంది
వాలినట్టే వాలి
ఎగురుతూనే
రెప్పలు రెపరెప లాడించడమే కానీ
ఒక్క క్షణం నిలకడుండదు
బహుశా సుప్తచేతన స్థితిలో
అంత నిద్రా ముగించిందేమో
చిట్టి పాదాలతో పూ పరాగాలు
చేరవేస్తూ
కొత్త జీవనానికి
అంకురార్పణ చేసే
సీతాకోకచిలుక
రంగులే చూస్తున్నావు
అందాలు
మాత్రమే చూసే
మనిషివి
అండాల్ని మోయడం
ప్రపంచానికి పురుడు పోయడం
ఎప్పుడు గుర్తిస్తావు?