అడుగు తీసి అడుగేసే
తృటిలో
అగాధమై – నేల
ఏమి మెదిలిందో
మనసులో
ఎవరు తచ్చాటలాడేరో
ఏ అవిశ్వాస నిశ్వాసం…
ద్రవం దారువై
ఎందెందు వెదకి చూసిన అందందేయై..
కళ్ళు తెరచి చూస్తే
కెరటాలని కీర్తిస్తూ
ఈతరాని పర్యాటకుల గుంపు
ఒడ్డుకి దణ్ణం పెట్టుకొని
ఒడ్డుకి విసిరేసిన కెరటానికి
చేయెత్తి
ఇసుకరాసిన కళ్ళు
పాండవుల రథాలు
కోసుకుపోయిన దేవళం
నీకునేను నాకునువ్వు