ఖర్చుపెట్టడానికి
సంపాదించింది
అయిపోయింది
అమ్మకిచ్చింది, అలికిచ్చింది
వాడుకొన్నది, పనివాడికిచ్చింది
తిండికి, తినడానికిచ్చింది
మందుకి, మందులకి
దళారికి, సర్కారుకీ
పిడుక్కి, బిచ్చానికి
లెక్క తేలడంలేదు
జేబు ఖాళీ
తరిగే వయసులో
తరగని సంపదా?
దాచుకున్న నిధులెక్కడ
వంట గదిలోనా?
పిల్లల గదిలోనా?
వచ్చేనెల పింఛను లోనా?
ఊరవతల ఖాళీ జాగాలోనా?
పెట్టెలోనా పేటిక లోనా?