ఒక వాక్యం దగ్గరో
ఒక ఆలోచన దగ్గరో
రెపరిప లాడే కళ్ల దగ్గరో
ఆగిపోతాం

ఆగిన చోటునించి
మళ్ళీ మొదలెట్టడం
కుదిరే పనేనా?

ఆగిపోయేమా
ముందుకిపోయేమా
మొదటికి రావడం
అవసరమా!

ఈ పుస్తకం మూసి
కొత్త బాట పడదాం
ఈ సంగీతం నేపథ్యంలో
మనోధ్వని విందాం
కళ్ళు మూసుకుని
అంతర్యానం చేద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *