విజయలక్ష్మి గారి పుస్తకాలు ఈ మధ్యే చదివేను.. జ్ఞాపకాల జావళి చాల బావుంది. హాస్య కథల గురించి చెప్పక్కర్లేదు. అందెవేసిన చేయి. పూర్వి కథలు కూడా బావున్నయి. బహుశా అంత ఒద్దికగా అందంగా మధ్యతరగతి జీవితాల్ని సరళంగా స్త్రీ సహజమైన లాలిత్యంగా చెప్పినవాళ్లు అరుదేమో. దిగువ వర్గాలపై సానుభూతి కనిపిస్తుంది కానీ వాళ్లతో మమైకత్వం లేకపోవడం ఎగువ మధ్యతరగతికి ప్రతిబింబమే. బహుశా ఆవిడ సామాజిక నేపధ్యం కారణమనిపిస్తుంది.
అభినందనలు.