ఎలనాగ గారి పుస్తకం – ‘యుక్తవాక్యం’ మారుతోన్న తెలుగు సమాజానికి అత్యంత అవసరమైన పుస్తకం. తెలుగు- మనం మాట్లాడుకునే భాషే. రోజూ పత్రికల్లో కనిపించే భాషే. దృశ్య శ్రవణ యంత్రాల ద్వారా మన ఇంద్రియాలకి అందుతోన్న మన తల్లిబాసే- కానీ, ఇతర భాషల ప్రభావం వల్లనూ, భాష పరంగా సరైన అవగాహన లేకపోవడం వల్లనూ, విచ్చలవిడి ప్రయోగశాలిత్వంవల్లనూ, ముఖ్యంగా, భాషని తేలికగా తీసుకోవడంవల్ల, అనేకమైన తెలిసితెలియని తప్పులు ఒప్పులుగా చెలామణి అవుతున్నాయి.
తొంభైయారు పేజీల ఈ పుస్తకం, సోదాహరణంగా భాషా సవ్యతవేపు మనల్ని తిప్పే ప్రయత్నం చేస్తుంది.
పత్రికలలో పని చేసేవాళ్ళకి, ప్రసారమాధ్యమాలలో పనిచేసేవాళ్ళకి పాఠ్యపుస్తకంగా ఉపయోగిస్తుంది. అంతే కాదు, వచనకవులు కూడా తమ స్వేచ్ఛా ప్రయోగాలని సరిచూసుకోవడానికి అవసరమైన సామగ్రి ఇందులో దొరుకుతుంది.
బాగా చెప్పారు కానీ ఆ పుస్తకము ఎక్కడ లభిస్తుందో చెప్పలేదు.
షాపు చిరునామా, పబ్లికేషన్ గురించి తెలుపగలరు.