నా మాట తనకి వినబడదు
తన ఘోష నాకు వినబడదు
రోజు చూసుకొంటూనే ఉంటాం
పనిలో ఉంటానా-
పిలిచి నట్లనిపిస్తుంది
కనుబొమ్మలెగరేసి
చూస్తాను
ఆకతాయి పిల్లాడిలా
పడవ నడుపుతూ
తన పాటున తాను
అప్పుడప్పుడు
ఏదో ఆలోచిస్తూ తనకేసి
చూస్తానా-
నీటి కాగితాన్ని పరిచి
చదువుకొమ్మంటుంది
అద్దానికి అటూ ఇటూ
నేనూ సముద్రమూ