ఎందుకలా
విడిచేసిన
బట్టలకోసం
ప్రార్ధిస్తారు?
బట్టలా అవి?
ఆవుల పాడి వాసన
వెన్న జిడ్డు
లేగ దూడలు
ఒరుసుకొని
ఒంటికంటించిన
జేగురు మట్టి
పేడకంపు
జలకాలాడి
యముననీది
ఒడ్డునున్న స్ఫటికరాళ్లతో
ఒళ్ళురుద్దుకొని
మెరిసిపోతూ
ఇంకా
వసనాలంపటాలెందుకు
రండి ఆడుకొందాం
మధుక్రీడలు
పుప్పొడి పరాగల
పరిమళాల
మేని జలదరింపు
గాలి పడగల
వల్లెవాటు