పడిపోయిన చోటే
వెతుకుతున్నాను
ఉదయం
మధ్యాహ్నం
ఎండలో,
చీకటపడ్డాక,
దీపం వెలిగించుకొని,
వానలో గొడుగేసుకొని
ఆకలేస్తే
ఇంటికెళ్లి ఆన్నం తిని మళ్ళీ…
నిద్ర వచ్చినప్పుడు
కాస్త కునుకుతీసి…
ఏళ్ళు గడుస్తున్నాయి కానీ
దొరకడం లేదు
మొదట్లో
ఎందుకు వెతుకుతున్నానో
తెలుసు.
ఇప్పుడే…
సూపర్బ్ కవిత?!సర్.నాకు,నచ్చింది, భావన బాగుంది. ధన్యవాదాలు