నా మటుక్కు నాకు
ఇల్లంటే కొన్ని గుమ్మాలూ
మరిన్ని కిటికీలూ కాదు

గాలి – నా ఆలోచనల్లా
స్వేచ్చగా తిరగడానికీ
వెలుతురు – నా స్నేహుతుల్లా
అంతరంగంలోకి ప్రసరించడానికీ

తలుపులు బిడాయించుకొని
రహస్యక్రీడల
క్షణిక సుఖాలు
కప్పెట్టుకొన్న సిగ్గుతో
ఊపిరి సలపని
బాహు బంధాలు
నిరంతర చేష్టలు
కావు కదా

అందుకే నాకు ఇల్లంటే
హృదయ ద్వారాలు తెరవడం
మనస్సంగీతాన్ని పంచడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *