రాత్రి ఎప్పుడవుతుందా అని
చూస్తుంటాను
పగలంతా
సముద్రం దగ్గర
నదీ మూలాన్ని
తలుచుకొంటూ
కరిగే మంచుకోసం
చూస్తుంటాను
రాత్రికి పగటికి
వారధినవుతా
రంగులు మారే
కాలరేఖనై
నేను నించున్నదే
నేల
ప్రపంచాన్ని
రెండుకళ్ళతోటే
చూస్తే
దృష్టిలోపం..
ప్రపంచాన్నీ
మనోనేత్రాన్నీ తెరవడం ఎలా?