ఊర్లో ఉన్నా
ప్రవాసినైనా
సమక్షంలోనూ
పరోక్షంలోనూ

పనివేళ
పనిలేని వేళ
నడక వేళ
నిద్రవేళ
చదివేటప్పుడు
చూచేటప్పుడు

మౌనంతో
మాటలతో

ఆనందాంతరంగంతో
విహ్వలచిత్తుడినై
రూపారూప
ధ్యానంతో…

తల్లీ నిన్నుదలంతు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *