అనుకొంటాం గానీ
నిజమెప్పుడూ
తెలుసుకొనేప్పటికి
అబద్ధమయిపోతుంది
భద్రతగా ఉన్నామనుకొంటామా
వాస్తవం కొట్టొచ్చినట్లు
కాదని తెలుస్తుంది

ఈ విత్తనాలు
మొలకెత్తుతాయని
కష్టపడి నాటుతామా
వాన రాక
వచ్చినప్పుడు
ముంచెత్తి
తుట్టతుదకు
గుప్పెడు నువ్వులయి
నవ్వులపాలు చేస్తాయి

అద్దం దుమ్ము దులిపి
చూస్తాను కదా
గుర్తుపట్టడానికి
ఎవరినైనా ఎరువు తెచ్చుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *