నలుగురూ పట్టుకొని
కూర్చోబెట్టేరు
అతను నెత్తి మీద
నీళ్లు జల్లేడు
కత్తి తీసి
బుర్ర చెక్కేసేడు
సున్నం బొట్లు పెట్టేరు
అంతవరకూ తచ్చాడుతోన్న
గాడిద పారిపోయింది
పాత కారొకటి తెచ్చి
అందులోనే కూర్చోపెట్టేరు
ఊరేగింపు కదిలింది
డప్పులమోత మధ్య
జిందాబాద్ జిందాబాద్