ఉత్తరం రాయాలనే ఉంటుంది
కానీ పెన్నే కనపడదు
పెన్ను దొరికినప్పుడు పేపరు
ఈ రెండూ దొరికితే
అంత తొందరేవుందనుపిస్తుంది
కవిత్వం కూడా అంతే
అయినా ఎవరికి రాయడం?
చదివే వాళ్లెవరూ?
రాయాలనుకోవడం
రాయకపోవడం రెండూ ఒకటే
అస్తిత్వమే ప్రశ్న అయినప్పుడు
తతిమ్మావన్నీ సున్నే!