ఏ పుస్తకం కోసమో
వెతుకులాట?
ఈ పుస్తకంలో దొరికింది
కాగితం మీద అద్దిన
లిప్స్టిక్ ముద్ర
పెదాల ఆనవాళ్లు
నెమలీకల
బాల్యం కాదు
గూడుపుఠాణీ
యవ్వన క్రీడ
తీరంలో తప్పిపోయిన
పాదాల గుర్తుల్లా
పద్య శకలాన్ని
అంటిపెట్టుకొని
తీయటి ఘుమాళింపు
‘ సంగం’ కవుల
విరహ గీతాల
వ్యాకులతలో
మిట్ట మధ్యాహ్నపు
చెట్టుకింద
నీరెండ
నీటికుండలో
గాలికి రాలిన
పండుటాకులు