ఉఛ్ఛ్వాస నిశ్వాసాల
సహజ లయ
ఎప్పుడు తప్పిందో గానీ
ఇప్పుడు పొగపీల్చడమే
అలవాటయ్యింది
మొక్కల్ని ఏరిపారేసేక
చెట్లని కలపగా మార్చేక
ఖాళీ స్థలాలు ఎపార్ట్మెంట్లయ్యేక
ముక్కు మూసుకోవడం
మోక్షానికి దారీ కాదు
యోగ భంగిమా కాదు
ఆక్సిజన్ మాస్క్
కొత్త యూనిఫారమూ కాదు