ప్రయాణం ముగిసేక
ఎంత అలసట!?
ఆహ్లాదానికే అయినా
మార్పుకోసమే అయినా
ఎంత తొందరగా
నిత్య జీవన సమ్రంభంలో
పడదామా అని ఆత్రుత
కడలైనా, మైదానమైనా
కొండలైనా, నదీలోయలైనా
నిత్యనైమిత్తిక జీవితాన్ని
మరిపించలేవు
మించి మురిపించలేవు
ఉచ్చ్వాస నిశ్వాసాల నిరంతరాయంలానే
సూర్యచంద్రుల గమనంలానే
జ్వాలాతేజమై దైనందిన చంక్రమణంలో
శ్రమపరిమళమై
నిత్యోత్సవం బతుకు పుస్తకం