హృదయ స్పందనలని
ఏ వర్ణమాలతో వర్ణించడం?
ఏ రంగులకుంచెతో చిత్రించడం?
ఉచ్చ్వాస నిశ్వాసాల
పీడన శక్తెంత?
భౌతికానికి రంగులు
రసాయనక్రియలకి ఏం రంగులు?
చర్యలమయం
ఉపచర్యల గుణింతం
జీవితం ఎక్కాలపుస్తకం
కాలాన్ని కొలిచినట్టే
కాలాన్ని రంగుల్లో చూసినట్టే
మంచూ, చీకటీ
చివురుటాకులూ
జీర్ణపత్రాలూ
జ్వాలా తోరణాలు
జీవితానికి నీడలు కావా?