ప్రశ్నలగుంపులోంచి
ఒక చీటీ ఎత్తుకొంటా
తెరిచి నవ్వుకొని
ఇంతేకదా అనుకుంటానా,
జటిలమై
తాడులా మెడచుట్టూ
అల్లుకొని
ఎంత వెతికినా
జవాబు దొరకదు
అప్పులా…
ఆత్మావలోకనానికి
మూసిన కన్నులా…

మెడసాచి గదిలోకి
దూరిన ఒంటె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *