అతనంటాడు కదా
ఎంతో గర్వంగా…

‘రాజేంద్ర చోళుడు
తూర్పు దేశాలపై
నావిక దళాలతొ
దండెత్తి ఓడించాడని’,

‘చరిత్రకారులు
కావాలనే ఈ
హైందవ విజయాన్ని
కప్పెట్టేరని.’

అవున్నిజమే!

అశోకుడి
శాంతి సందేశం కంటే
బౌద్ధ ధర్మపు
అహింసా యాత్రల కంటే

రక్తపుటేరులే
ఛాతీని పొంగిస్తాయని
విశ్వమానవుడికి
మనమెవరి కంటే
ఉన్నతులం కామని
ఎంత సునాయాసంగా తెలపగలం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *