చెరువులు మింగడం అయింది

కొండలు కొల్లగొట్టడం కూడా..
గనుల సంగతి చెప్పేదేముంది?

ఇసుక మాత్రమే ఇన్నాళ్లూ
ఇప్పుడు నదులు ఔపోసనకి
తెల్లబట్టల తెల్లగడ్డాల దండయాత్ర
రక్షించడమంటే
భక్షించడమనే
ఇదంతా కొత్త
నిర్వచనమే
బతుకే కళ
అంతా ఈశోపనిషత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *