పాట నేనే
పరవశాన్నీ నేనే
పది బళ్ల పరుగులకింద
నలిగిన నల్లేరు నేనే
దాపటెద్దు నవులుతోన్న
జ్ఞాపకాన్నీ నేనే
చెర్నకోల విదిలిస్తూ
జోగుతోన్న పిలగాడ్నీ నేనే
చీకటికి సాయంగా
వెలుగుతోన్న చందమామా నేనే
చిమ్మెట శబ్దమూ
మిణుగురు మెరుపూ
తడితగిలిన
మట్టి వాసనా నేనే